ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎన్డీఏ కూటమి ఏకపక్ష నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పురించండి సిపిఐ రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన కొనసాగిస్తున్న డబల్ ఇంజన్ సర్కార్… సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాలక ప్రభుత్వాలపై ఘాటు విమర్శ

బద్వేలు,అర్జున్ సమాచారం:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బద్వేల్ పట్టణంలోని జేవి భవనం నందు విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ప్రధానంగా నల్లధనం వెలికి తీసి ప్రజలకు పంపిణీ చేస్తానని ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు మోసం చేశాడు మేక్ ఇండియా మేడిన్ ఇండియా పేరుతో భారతదేశ ముందుకు పోతున్నదని చెబుతున్నప్పటికీ కేవలం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని సంపద సృష్టించే శ్రమజీవులకి సంపదలో వాటా లేదని కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారని పేద ధనిక అనే తారతమ్యం అంతరం పెరిగిపోవుచున్నదని అలీన  విదేశాంగ విధానం కాకుండా అమెరికా సామ్రాజ్యవాదులకు సాగిలపడి దేశ ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని కార్పొరేట్ కనుసనల్లో నడుస్తున్న ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువకులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడుతున్నారని నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగితే ఆకలి దరిద్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచారం ఆందోళనకు శ్రీకారం చుడుతున్నానని రాష్ట్రంలో డబ్బులు ఇంజన్ సర్కారులు అభివృద్ధి అటకెక్కిందని ఇది డబుల్ సర్కారు కాదు ట్రబుల్ ఇంజన్ సర్కారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ  రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి చుట్టూ తిరిగి ప్రజల కు భ్రమలు కల్పిస్తున్నారని పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమలు మాటలకే పరిమితమైందని ఆయన అన్నారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు పాదయాత్రలు నిర్వహించి నరహంతకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, విజయలక్ష్మి, బాలు , ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సహాయ కార్యదర్శులు ఇమ్మానేలు, పివి రమణ, కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ, నాగరాజు, గూడూరు పెంచలయ్య, జిఎల్ నరసింహ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు
============================